వాషింగ్టన్: ఇరాన్లో ఎఫ్ 15ఈ యుద్ధ విమానం కూలిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అనుచరులపై అరిచారు. జరుగబోయే పరిణామాలపై ఆయన తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు ట్రంప్‌ను ‘వార్ రూమ్’ నుంచి దూరంగా ఉంచారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ (డబ్ల్యూఎస్‌జె) నివేదించింది. (Trump screamed at aides) ఏప్రిల్ 3న అమెరికాకు చెందిన ఎఫ్ -15 ఈగిల్ ఫైటర్ జెట్‌ను ఇరాన్ కూల్చివేసింది. ఒక పైలట్ ఆచూకీ తెలియగా మరో వైమానికుడి జాడ తెలియలేదు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన వారిపై అరిచారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్‌తో సహా సీనియర్ అధికారులపై పలు గంటల పాటు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంక్షోభం ముదురుతున్న కొద్దీ కీలకమైన వార్ రూమ్ బ్రీఫింగ్‌లకు ట్రంప్‌ను దూరంగా ఉంచినట్లు సీనియర్ అధికారులు చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.
మరోవైపు ఇరాన్‌తో సంఘర్షణ సాగుతున్న తీరుపై ట్రంప్‌లో భయాలు పెరిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ పేర్కొంది. అత్యంత ముఖ్యమైన అమెరికా విదేశాంగ విధాన సంక్షోభాలలో ఒకటైన ఇరాన్ బందీల సంక్షోభం ఆయన మనసులో మెదిలినట్లు తెలిపింది. జిమ్మీ కార్టర్ హయాంలో హెలికాప్టర్లు, బందీలతో గందరగోళం, ఎన్నికల్లో ఓటమిని తెచ్చిపెట్టడం వంటి పరిణామాలు మళ్లీ జరుగుతాయని ట్రంప్ ఆందోళన చెందినట్లుగా ఆయన పాలనా అధికారి పేర్కొన్నట్లు వెల్లడించింది.
అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికను వైట్ హౌస్ ఖండించింది. ట్రంప్ మన దేశానికి అవసరమైన స్థిరమైన నాయకుడిగా నిలిచారని ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని ఇరాన్‌కు నిరాకరించాలన్న ట్రంప్ లక్ష్యానికి అనుగుణంగానే ఆ దేశంపై మిలిటరీ ఆపరేషన్ ఉన్నదని ఆమె అన్నారు.
Also Read:
Shamim Mafi | ఇరాన్‌కు బాంబులు, డ్రోన్లు.. లాస్ ఏంజెలెస్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్
Iran vs US | అమెరికాతో రెండో విడత చర్చలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : ఇరాన్
Iran | హర్మూజ్ వద్ద భారత నౌకలపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నామంటున్న ఇరాన్