Iran : హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో శనివారం రెండు భారత నౌకల (Indian Ships) పై కాల్పులు జరిపింది తమ దళాలేనా..? మరెవరైనానా..? అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి (Ismaili Bagheyi) ఒక ప్రకటన చేశారు. ‘మా దళాలే భారత నౌకలను లక్ష్యంగా చేసుకొన్నాయా..?’ అనే అంశంపై సంబంధిత సంస్థలు విచారణ చేపట్టాయి’ అని బాఘేయి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
శనివారం హర్మూజ్ జలసంధిలో ఐఆర్జీసీ అనుమతి లభించిన తర్వాత ప్రయాణిస్తున్న రెండు భారత నౌకలపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో ఆ రెండు నౌకలు తిరిగి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లిపోయాయి. వాటిలో ఒక దానిలో 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉంది. ఈ ఘటనపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీచేశారు. ఇరాన్ జలసంధిని తెరిచినట్లు ప్రకటించిన తర్వాతే వాణిజ్య నౌకలు బయల్దేరాయి. అయినా ఆ నౌకలపై దాడి జరిగింది.
దాంతో ఆ రెండు భారత నౌకలు వెనుదిరిగి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లిపోయాయి. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వివరణ కోరుతూ భారత్‌లోని ఇరాన్ రాయబారికి సమన్లు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఘటనపై దర్యాప్తు చేయిస్తున్నట్లు ఇస్మాయిలీ వెల్లడించారు.