Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. వెనెజువెలాపై దాడులు చేసింది తామే అని ప్రకటించారు. వెనెజువెలా (Venezuela), అధ్యక్షుడు నికోలస్ మడురో (Nicolas Maduro)పై పెద్ద ఎత్తున దాడిని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. నికోలస్‌తో పాటూ ఆయన భర్యాను అదుపులోకి తీసుకున్నట్లు ట్రంప్ వెల్లడించారు. వారిని వెనెజువెలా నుంచి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ దాడికి సంబంధించిన వివరాలు మార్ ఎ లాగోలో నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ట్రంప్ తెలిపారు.
US President Donald Trump (@POTUS) posts on Truth Social, “The United States of America has successfully carried out a large scale strike against Venezuela and its leader, President Nicolas Maduro, who has been, along with his wife, captured and flown out of the Country. This… pic.twitter.com/xg3kEsccQl
— Press Trust of India (@PTI_News) January 3, 2026
నికోలస్ మడురో ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వెనిజువెలా చుట్టూ కరేబియన్ సముద్రంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. ఇక మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా టార్గెట్ చేసింది. పసిఫిక్, కరేబీయన్ సముద్రాల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లు, జలాంతర్గాములపై దాడులు చేస్తోంది. ఈ పరిణామాల వేళ ఇవాళ ఉదయం భారీ పేలుళ్లతో వెనెజువెలా దద్దరిల్లింది. రాజధాని కరాకస్ (Caracas)లో పేలుళ్లు సంభవించాయి. శనివారం తెల్లవారుజామున దాదాపు ఏడు చోట్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతేకాదు, కరాకస్‌పై తక్కువ ఎత్తులో విమానాలు గర్జించాయి. ఈ శబ్దాలతో స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ఈ దాడి చేసింది తామే అని ట్రంప్ ప్రకటించారు.
Also Read..
Venezuela | భారీ పేలుళ్లతో దద్దరిల్లిన వెనెజువెలా.. వీధుల్లోకి పరుగులు తీసిన జనం
Mexico Earthquake | ప్రెస్‌మీట్ మధ్యలో భూకంపం.. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు
Brazil Road Accident | బ్రెజిల్లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి