Venezuela | అమెరికా, వెనెజువెలా (Venezuela) దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. తాజాగా భారీ పేలుళ్లతో వెనెజువెలా దద్దరిల్లింది. రాజధాని కరాకస్ (Caracas)లో పేలుళ్లు సంభవించాయి. శనివారం తెల్లవారుజామున దాదాపు ఏడు చోట్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. అంతేకాదు, కరాకస్‌పై తక్కువ ఎత్తులో విమానాలు గర్జించాయి. ఈ శబ్దాలతో స్థానికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీధుల్లోకి పరుగులు తీశారు.
నికోలస్ మడురో ప్రభుత్వాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వెనిజువెలా చుట్టూ కరేబియన్ సముద్రంలో భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించారు. ఇక మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా టార్గెట్ చేసింది. పసిఫిక్, కరేబీయన్ సముద్రాల్లో డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలు, ఆయిల్ ట్యాంకర్లు, జలాంతర్గాములపై దాడులు చేస్తోంది. ఈ పరిణామాల వేళ తాజా పేలుళ్లు చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read..
Brazil Road Accident | బ్రెజిల్లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి
Mexico Earthquake | ప్రెస్‌మీట్ మధ్యలో భూకంపం.. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు
Nepal | నేపాల్‌లో తప్పిన పెను ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో కాల్వ వైపు దూసుకెళ్లిన విమానం..