Mexico Earthquake | ప్రెస్‌మీట్ మధ్యలో భూకంపం.. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు
Mexico Earthquake | మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్మాక్రోస్కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Mexico Earthquake | మెక్సికోను భూకంపం వణికించింది. దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతాల్లో 6.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గెరెరో రాష్ట్రంలోని శాన్మాక్రోస్కు సమీపంలోని అకాపుల్కో నగరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాదాపు 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని వల్ల ఏకంగా 33 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. 50 వరకు ఇండ్లు ధ్వంసమయ్యాయి.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో అకాపుల్కో సమీపంలో భూకంపం సంభవించింది. ఈ భూ ప్రకంపనలు ఉత్తర దిశగా సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీ వరకు వ్యాపించింది. భూకంపం హెచ్చరికల సైరన్లు మోగడంతో లక్షలాది మంది ప్రజలు ఇళ్లు, ఆఫీసుల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. మెక్సికో సిటీలో జనాలు బయటకు పరుగులు తీస్తున్న క్రమంలో ఓ అపార్ట్మెంట్లోని రెండో అంతస్తు నుంచి పడి 60 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మంది గాయపడ్డారని నగర మేయర్ క్లారా బ్రుగాడా తెలిపారు. అలాగే భూకంప కేంద్రానికి సమీపంలోని ఓ గ్రామంలో ఇల్లు కూలడంతో 50 ఏళ్ల మహిళ మృతి చెందిందని గెరెరో గవర్నర్ ఎవలిన్ సాల్గోడో పేర్కొన్నారు.
ప్రెస్‌మీట్ ఆపి.. బయటకు మెక్సికో అధ్యక్షురాలు
భూకంపం సంభవించిన సమయంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ ప్రెస్‌మీట్ నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో ప్రెస్‌మీట్‌ను మధ్యలోనే ఆపేశారు. అధ్యక్షురాలితోపాటు సిబ్బంది, మీడియా అంతా అధ్యక్ష భవనాన్ని ఖాళీ చేసి బయటకు వచ్చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కార్మికుల హాజరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ’
Insurance | మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.2 లక్షల బీమా సాయం
సీసీఐ కొనుగోలు కేంద్రంలో కానరాని రైతులు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
RS Praveenkumar | జర్మనీలో ఉద్యోగమని చెప్పి ఓ యువకుడి చేతికి కత్తి ఇచ్చారు.. కాంగ్రెస్ సర్కార్ మరో స్కాంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!

