Donald Trump | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చర్చలకు సమయం దగ్గరపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు (Russian Oil) కొనుగోలు కారణంగా భారత్‌పై అమెరికా విధించిన భారీ సుంకాలు (Tariffs) మాస్కో ఆర్థిక వ్యవస్థకు (Russia economy) పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలకుతోడు అంతర్జాతీయ ఒత్తిళ్లతో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని ట్రంప్ పేర్కొన్నారు. ‘రష్యా ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగోలేదు. అమెరికా విధిస్తున్న వాణిజ్య ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిళ్లతో మాస్కో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. రష్యా తమ దేశాన్ని తిరిగి నిర్మించుకోవాల్సి వస్తుంది. అది చాలా పెద్దదేశం. రాణించడానికి అనేక అవకాశాలున్నాయి. వారివద్ద నుంచి అత్యధికంగా చమురు కొనే దేశం భారత్‌పై 50 శాతం టారిఫ్ వేస్తామని మేం హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం. ఇది ముమ్మాటికీ రష్యాకు పెద్ద దెబ్బ’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికా పర్యటనకు రానుండటం ఎంతో గౌరవప్రదంగా భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. పుతిన్‌తో నిర్మాణాత్మక సంప్రదింపులు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
US-China Trade | అమెరికా-చైనా మధ్య ట్రేడ్ డీల్‌కు మరో 90 రోజులు విరామం
Donald Trump | బంగారం దిగుమతులపై సుంకాలు ఉండవు.. ట్రంప్ కీలక ప్రకటన