Donald Trump | అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో థ్యాంక్స్ గివింగ్ డే (hanksgiving Day)ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు (Pardons Turkeys) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్షమాభిక్ష పెట్టారు. వాడిల్(Waddl), గోబుల్ (Gobble) అనే రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు.
ఈ కార్యక్రమానికి ముందు ‘ది నేషనల్ థ్యాంక్స్ గివింగ్ టర్కీ’ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వాడిల్ (Waddl), గోబుల్ (Gobble) అనే రెండు టర్కీ కోళ్లు ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది. అయితే వాడిల్ మాత్రమే ఈ కార్యమక్రమంలో ప్రత్యక్షమైంది. అయినప్పటికీ ఈ రెండు కోళ్లకూ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి హాజరయ్యారు. ఇక ఈ వేడుకలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు, ఇతర అధికారులు హాజరయ్యారు.
A time-honored American tradition: pardoning America’s LUCKIEST birds.
These turkeys have officially been saved from the Thanksgiving table. 🦃🔥 pic.twitter.com/xtuNgnHJn8
— The White House (@WhiteHouse) November 26, 2025
Also Read..
Karnataka | సిద్ధరామయ్య Or శివకుమార్.. డిసెంబర్ 1నాటికి తేలనున్న కర్ణాటక కాంగ్రెస్ పంచాయితీ
Road Accident | ట్రక్కును ఢీ కొట్టిన కారు.. ఐదుగురు మృతి
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం!