Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు తెలిసింది.
ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping)కు కూడా ఆహ్వానం పంపినట్లు తెలిసింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రావాల్సిందిగా జిన్‌పింగ్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. నవంబర్లోనే ఆహ్వానం పంపినట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. అయితే, ఈ వార్తలపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇదిలా ఉండగా.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read..
Elon Musk | చరిత్ర సృష్టించిన మస్క్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు
Exercise | రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి.. జ్ఞాపకశక్తి పెంచుకోండి
Watch: హైవేపై విమానం క్రాష్ ల్యాండ్.. తర్వాత ఏం జరిగిందంటే?