Exercise | లండన్ : వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి, ఆలోచనా శక్తి తగ్గుతుంటుంది. దీనికి పరిష్కారం కనుగొనేందుకు యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు వినూత్న ప్రయోగం చేశారు. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయటం ద్వారా జ్ఞాపకశక్తి, ఆలోచనాశక్తి మెరుగవుతున్నదని సైంటిస్టులు తేల్చారు. ‘బ్లూమ్‌బర్గ్’ కథనం ప్రకారం, రోజూ 30 నిమిషాలపాటు వ్యాయామంతోపాటు రాత్రి కనీసం 6గంటలు కంటినిండా నిద్ర ఉంటే.. మరుసటి రోజుకి ఆ వ్యక్తి ఆలోచనా శక్తి మెరుగువుతున్న సంగతి పరిశోధకులు గుర్తించారు.
50 -83 ఏండ్ల వయసున్న 76 మందిని ఎంచుకొని 8 రోజులపాటు వారితో 30 నిమిషాలపాటు వ్యాయామం చేయించారు. వారి జ్ఞాపకశక్త్తిని పరీక్షించేందుకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహించారు. రోజూ అరగంట వ్యాయామం చేయటం ద్వారా, మరుసటి రోజు నిర్వహించిన ఆన్లైన్ టెస్ట్‌లో వాళ్ల స్కోర్ 2 నుంచి 5% పెరిగినట్టు గుర్తించారు.