వాషింగ్టన్: చిన్న విమానం హైవేపై క్రాష్ ల్యాండ్ అయ్యింది. వాహనాలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ విమానం రెండు ముక్కలైంది. (Plane splits in half) అయితే పైలట్‌తోపాటు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ట్విన్ ఇంజన్ ప్రొపెల్లర్ విమానం విక్టోరియాలోని స్టేట్ హైవేపై చాలా తక్కువ ఎత్తులో ఎగిరింది. రహదారిపై వెళ్తున్న మూడు కార్లను ఢీకొట్టి క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆ విమానం రెండు ముక్కలైంది. దీంతో విమానం శిథిలాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
కాగా, ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఒక వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో పోలీసులు, అధికారులు ఊరట చెందారు. వైమానిక అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Plane crash in Victoria, Texas. 😮pic.twitter.com/TzkHGHI4Eb
— DramaAlert (@DramaAlert) December 12, 2024