Donald Trump | ఇరాన్ (Iran) పౌర అణు కార్యక్రమానికి మద్దతుగా అమెరికా సుమారు 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల కోట్లు) ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైందంటూ అంతర్జాతీయ మీడియా పేర్కొంటోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ట్రంప్ యంత్రాంగం ఓ ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు సీఎన్ఎన్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ వార్తలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా స్పందించారు. ఇరాన్‌కు 30 బిలియన్ డాలర్ల సాయం వార్తలను తోసిపుచ్చారు. అవన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేశారు. ఇదంతా ‘ఫేక్ మీడియా’ సృష్టిస్తోన్న కల్పిత కథనాలంటూ మండిపడ్డారు. ఈ మేరకు ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌తో యుద్ధం సమయంలో ఇరాన్‌పై అమెరికా తీవ్ర దాడులు చేసింది. మూడు అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులను వేసింది. ఈ దాడితో అమెరికాతో అణు చర్చలకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంలేదు. దీంతో రంగంలోకి దిగిన అగ్రరాజ్యం.. అణుచర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇరాన్‌కు భారీ సాయాన్ని చేసేందుకు సిద్ధమైందంటూ సీఎన్ఎన్ నివేదించింది. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెహ్రాన్‌కు 30 బిలియన్ డాలర్ల సాయం చేసేందుకు ముందుకొచ్చినట్లు పేర్కొంది. ఈ వార్తలపై ట్రంప్ తాజాగా స్పష్టతనిచ్చారు.
Also Read..
Iran | అణుడీల్ కుదరాలంటే.. ఖమేనీని మర్యాదగా సంబోధించాలి : ట్రంప్‌కు ఇరాన్ చురకలు
Donald Trump | కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన
Donald Trump | భారత్-పాక్ వివాదం.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట