Donald Trump | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధాని ఆపింది తానేనని మరోసారి వ్యాఖ్యానించారు. అణు సంఘర్షణను తాను ఒంటరిగానే అణచివేశానని పేర్కొన్నారు. వైట్‌హౌస్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీ-ఇస్లామాబాద్‌లు యుద్ధాన్ని ఆపకపోతే వాణిజ్య ఒప్పందాలను పూర్తిగా నిలిపివేస్తామని (cancel all trade deals) హెచ్చరించాలని సీనియర్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘యుద్ధాన్ని కొనసాగిస్తే రెండు దేశాలతో అన్ని వాణిజ్య ఒప్పందాలను ట్రంప్ రద్దు చేయాలనుకుంటున్నారని భారత్, పాక్‌కు చెప్పాలని అధికారులను ఆదేశించాను. దీంతో వారు యుద్ధాన్ని ఆపేశారు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కాగా, పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) స్వయంగా ట్రంప్‌తోనే చెప్పినప్పటికీ అధ్యక్షుడి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం తన ఘనతే అని పదేపదే ప్రకటించుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపింది తానేనని, రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు కృషి చేసినట్లు చెప్పుకుంటున్నారు.
కాగా, ఈవివాదంపై ప్రధాని మోదీ.. స్వయంగా ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన విషయం తెలిసిందే. మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించదని స్పష్టం చేశారు. ఇందులో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్‌కు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) వెల్లడించారు. దాదాపు 35 నిమిషాల పాటూ ఇద్దరూ ఫోన్లో సంభాషించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను ట్రంప్‌కు మోదీ వివరించినట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మిలటరీ స్థాయి చర్చలు జరిగాయన్నారు. ఇతరుల మధ్యవర్తిత్వాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పినట్లు మిస్రీ వివరించారు.
Also Read..
Jeff Bezos | ప్రియురాలిని పెళ్లాడిన జెఫ్ బెజోస్.. ఫొటో వైరల్
Donald Trump: ట్రంప్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
Green Card | నేరాలకు పాల్పడితే గ్రీన్ కార్డు రద్దు.. అమెరికా ఇమిగ్రేషన్ సంస్థ హెచ్చరిక