Green Card | నేరాలకు పాల్పడితే గ్రీన్ కార్డు రద్దు.. అమెరికా ఇమిగ్రేషన్ సంస్థ హెచ్చరిక
Green Card | అమెరికాకు చెందిన పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వలసదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఎవరైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వెంటనే వారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఉగ్రవాదానికి మద్దతునివ్వడం లేదా ప్రోత్సహించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించింది.
Green Card | వాషింగ్టన్: అమెరికాకు చెందిన పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) వలసదారులకు తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఎవరైనా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వెంటనే వారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించింది. ఉగ్రవాదానికి మద్దతునివ్వడం లేదా ప్రోత్సహించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడేవారి గ్రీన్‌కార్డులను, వీసాలను రద్దు చేస్తామని ఎక్స్ వేదికగా ప్రకటించింది. గ్రీన్ కార్డు ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం షరతులతో కూడిన సౌలభ్యం అని, అంతేకానీ హక్కు కాదని స్పష్టం చేసింది.
‘అమెరికాకు రావడం వీసా పొందడం లేదా గ్రీన్ కార్డు లభించడం ఓ గౌరవం. మా చట్టాలను, విలువలను తప్పనిసరిగా గౌరవించాలి. మీరు హింసకు సహకరించినా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినా లేదా మద్దతు తెలిపినా లేదా ఇతరులను అందుకు పురికొల్పినా మీరు అమెరికాలో నివసించే అర్హతను కోల్పోతారు’ అని పేర్కొంది. గ్రీన్ కార్డు పొందిన ఇతర దేశాల పౌరులు ఇకపై అమెరికాలో చట్టబద్ధమైన పౌరులుగా శాశ్వతంగా నివసించవచ్చు. ప్రస్తుతం అమెరికాలో 1.8 కోట్ల మంది గ్రీన్‌కార్డు పొందినవారు ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత అమెరికా ప్రభుత్వం ‘క్యాచ్ అండ్ రివోక్’ విధానాన్ని అనుసరిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

