Iran | ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ (Iran) సీరియస్ అయ్యింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రాణాలను తానే కాపాడానని, అయినా అతడు కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ (Abbas Araqchi) ఘాటుగా స్పందించారు. ఖమేనీని అగౌరవంగా సంబోధించడాన్ని ట్రంప్ మానుకోవాలని చురకలంటించారు.
‘ట్రంప్ నిజంగా మాతో అణు ఒప్పందాన్ని (nuclear deal with Iran) కోరుకుంటుంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మర్యాదగా సంబోధించాలి. ఖమేనీ పట్ల అగౌరవకరమైన, ఆమోదయోగ్యం కాని స్వరాన్ని పక్కన పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. ఇక ఇదే సందర్భంగా ఇజ్రాయెల్‌పై కూడా అబ్బాస్ అరాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దాడులతో అతలాకుతలమైన ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అమెరికా వద్దకు పరిగెత్తడం తప్ప వేరే మార్గం లేదంటూ వ్యాఖ్యానించారు. బెదిరింపులు, దాడులకు భయపడమని ప్రపంచానికి చాటి చెప్పిన శక్తివంతమైన ఇరానియన్ ప్రజలు ఎవరి దగ్గరి నుంచి సానుభూతి, ప్రాణ భిక్ష కోరుకోరని పేర్కొన్నారు.
Also Read..
Donald Trump | కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నాం.. ట్రంప్ సంచలన ప్రకటన
Donald Trump | భారత్-పాక్ వివాదం.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
Donald Trump: ట్రంప్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు