Donald Trump | కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ (Digital Services Tax)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌పై కెనడా వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య చర్చలు (US Canada Trade Talks) ముగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో సంచలన ప్రకటన చేశారు. ‘కెనడాతో అన్ని రకాల వాణిజ్య చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నాం’ అని ప్రకటించారు.
కెనడలో డిజిటల్ సేవల పన్ను గతేడాది అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే, కంపెనీలు మాత్రం ఈ ఏడాది జూన్ 30 నుంచి పన్ను చెల్లింపులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. ఈ చట్టం ప్రకారం.. కెనడాలో ఆన్లైన్ ద్వారా గణనీయమైన ఆదాయం అర్జించే పెద్ద డిజిటల్ కంపెనీలు తమ ఆదాయంపై 3 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్ సేవలు, ఆన్లైన్ ప్రకటనలు, సోషల్ మీడియా సేవలు, వినియోగదారుల డేటా అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఈ పన్ను పరిధిలోకి వస్తుంది. ఈ విధానం యూఎస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన పెద్ద పెద్ద టెక్ కంపెనీలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీంతో అధ్యక్షుడు దీనిపై ప్రధానంగా దృష్టి సాధించారు. జూన్ 30 నుంచి ఈ కొత్త పన్నుల విధానం అమల్లోకి రానున్న నేపథ్యంలో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read..
Donald Trump | భారత్-పాక్ వివాదం.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
Donald Trump: ట్రంప్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు
Jeff Bezos | ప్రియురాలిని పెళ్లాడిన జెఫ్ బెజోస్.. ఫొటో వైరల్