Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సౌదీ అరేబియా (Saudi Arabia)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రియాద్ (Riyadh) చేరుకున్నారు. ఈ సందర్భంగా రియాద్‌ను ప్రపంచ ప్రధాన వ్యాపార కేంద్రంగా మార్చినందుకు సౌదీ యువరాజు (Saudi Crown Prince) మహమ్మద్ బిన్ సల్మాన్ (Mohammed bin Salman)ను ట్రంప్ ప్రశంసించారు.
ఈ క్రమంలో సౌదీ యువరాజుకు ట్రంప్ ఓ అసాధారణ ప్రశ్న వేశారు. ‘మీరు రాత్రి పూట నిద్రపోతారా..? మీరు ఎలా నిద్రపోతారు? సౌదీని ఎంతో గొప్పగా చేశారు. మాలో ఒకరిలా ఉంటూనే.. ఇంతలా ఎలా అభివృద్ధి చేశారు’ అంటూ ప్రశ్నించారు. సౌదీ అరేబియా అభివృద్ధిపై విమర్శకులకు ఎన్నో అనుమానాలు ఉండేవని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. వాటిని మహమ్మద్ బిన్ సల్మాన్ పటాపంచలు చేశారన్నారు. ఆ విమర్శలను అధిగమించి తన దేశాన్ని శక్తివంతమైన వ్యాపార కేంద్రంగా నిర్మించారంటూ కీర్తించారు. ట్రంప్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సీజ్‌ఫైర్‌కు ఎలా ఒప్పించానంటే?.. ట్రంప్
ట్రంప్ మంగళవారం సౌదీ అరేబియాలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో మాట్లాడుతూ.. తనకు యుద్ధాలంటే ఇష్టం లేదన్నారు. అందుకే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి తన ప్రభుత్వం కృషి చేసిందన్నారు. రెండు దేశాల మధ్య చారిత్రక సీజ్ఫైర్ ఒప్పందానికి తాను మధ్యవర్తిత్వం వహించానని చెప్పారు. ‘ఈ ఒప్పందం కుదరడానికి నేను వాణిజ్యంను అస్త్రంగా వాడాను. యుద్ధం మానేసి వాణిజ్యం చేసుకోవాలని సూచించా. అణ్వాయుధాల వ్యాపారం చేయడం కాదు.. మీ దేశాలు అభివృద్ధి చెందేలా వాణిజ్య సంబంధాలు పెంచుకోండి అని చెప్పాను’ అని ట్రంప్ పేర్కొన్నారు. రెండు దేశాలకు శక్తివంతమైన, బలమైన, ఆలోచనాపరులైన, మంచి నాయకులు ఉన్నారని, తన మాటలు విని వారు సీజ్‌ఫైర్‌కు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాయని తెలిపారు. లేకపోతే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయేవారన్నారు.
Also Read..
Donald Trump | సీజ్‌ఫైర్‌కు ఎలా ఒప్పించానంటే?.. భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్
Donald Trump | సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Indian Diplomat | భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు.. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశం