Indian Diplomat | భారత దౌత్యవేత్తకు పాక్ సమన్లు.. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశం
చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్, పాకిస్థాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ (High Commission) అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని పేర్కొంటూ.. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రతిగా పాకిస్థాన్ కూడా ఇస్లామాబాద్‌లోని ఓ భారత దౌత్యవేత్తకు (Indian Diplomat) సమన్లు జారీచేసింది.
ఇస్లామాబాద్: చర్యకు ప్రతిచర్య అన్నట్లుగా భారత్, పాకిస్థాన్ వ్యవహారం ఉన్నది. న్యూఢిల్లీలో ఉన్న పాక్ హై కమిషన్ (High Commission) అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్నాడని పేర్కొంటూ.. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ప్రతిగా పాకిస్థాన్ కూడా ఇస్లామాబాద్‌లోని ఓ భారత దౌత్యవేత్తకు (Indian Diplomat) సమన్లు జారీచేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ ఆరోపించింది.
ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారికి పాక్ విదేశాంగ శాఖ నోటీసులు జారీచేసింది. తన ప్రత్యేక హోదాకు విరుద్ధంగా కార్యకలాపాలలో పాల్గొన్నందుకు ఆయనను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. అధికార దుర్వినియోగాని పాల్పడ్డారని, ఇది ఆయన దౌత్య హోదాకు విరుద్ధంగా ఉందని వెల్లడించింది. 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలంటూ అందులో పేర్కొంది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు పర్సోనా నాన్ గ్రాటా నోటీసులు జారీచేస్తారు.
కాగా, ఇప్పటికే న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ అధికారిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. తన కార్యాలయ పరిధి దాటి కార్యకలాపాలు సాగిస్తున్న పాకిస్థాన్ హై కమిషన్ అధికారిని భారత్ మంగళవారం బహిష్కరించింది. అతను 24 గంటల్లో భారత్‌ను విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఆదేశించినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు జరిగిన సైనిక ఘర్షణ అనంతరం ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ అధికారి కార్యకలాపాలపై న్యూఢిల్లీలోని పాకిస్థాన్ డీ అఫైర్స్‌కు తెలియజేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

