China | అగ్రరాజ్యం అమెరికా – చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. రెండు దేశాలూ ఒకరిపై ఒకరు ప్రతీకార సుంకాలతో దాడికి దిగుతున్నాయి. చైనా దిగుమతులపై అమెరికా ఏకంగా 145 శాతం టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. అందుకు ప్రతిగా చైనా సైతం అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ వాణిజ్య యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడి సహాయకురాలు (Trump aide) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ధరించిన దుస్తులు హాట్ టాపిక్‌గా మారాయి.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ అయిన కరోలిన్ ఇటీవలే ఓ మీడియా సమావేశానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె చైనాలో తయారైన రెడ్ డ్రెస్ ధరించి కనిపించారు. ఈ విషయాన్ని గుర్తించిన చైనా దౌత్యవేత్త ఝాన్ ఝీషింగ్.. అందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్‌లో పోస్టు చేస్తూ వ్యంగ్యంగా స్పందించారు. ‘బిజినెస్ విషయంలో చైనాను నిందిస్తారు.. జీవితంలో మాత్రం చైనాలో తయారైనవి కొనుగోలు చేస్తారు’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘చైనా ఫ్యాక్టరీలో తయారైన అందమైన డ్రెస్ ధరించి.. చైనాను నిందిస్తున్నారు’, ‘చైనాను నిందించడం ఆమె పని.. చైనా దుస్తులను ఆస్వాదించడం ఆమె జీవితం’ అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
Accusing China is business.
Buying China is life.
The beautiful lace on the dress was recognized by an employee of a Chinese company as its product. pic.twitter.com/SfPyM4M02Z— Zhang Zhisheng 张志昇 (@salahzhang) April 14, 2025
Also Read..
Melinda Gates | విడిపోవాల్సిన ‘అవసరం’ ఏర్పడింది.. బిల్‌గేట్స్‌తో విడాకులపై మెలిందా గేట్స్
Donald Trump | అణ్వాయుధాలను మర్చిపోండి.. లేదంటే : ఇరాన్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్
Sudan | సూడాన్‌లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ బలగాల దాడులు.. 300 మంది పౌరులు మృతి