Sudan | సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన (African country) సూడాన్ (Sudan) అట్టుడుకుతున్నది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో (Rival generals) దేశం నరకకూపంగా మారిపోయింది. గత రెండేళ్లుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా ఆ దేశంలో జరిగిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
జామ్జామ్, అబూషాక్ శిబిరాలపై శుక్ర, శనివారాల్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (Rapid Support Forces) బలగాలు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 300 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ తాజాగా వెల్లడించింది. మృతుల్లో 20 మంది పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు నివేదించింది.
కాగా, ప్రపంచంలోని అతి పేద దేశాల్లో సూడాన్ ఒకటి. 2023 ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 30 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోటి మందికిపైగా సూడాన్‌ను వదిలివెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
Also Read..
Harvard University: హార్వర్డ్ యూనివర్సిటీకి 200 కోట్ల డాలర్ల నిధుల్ని నిలిపేసిన ట్రంప్ సర్కార్
Gold Trading Ban | ఇక అక్కడ బంగారం వ్యాపారం చేయలేరు..! మే ఒకటి నుంచి నిషేధం అమలులోకి..!
Lab-Grown Teeth | ప్రయోగశాలలో మానవ దంతం అభివృద్ధి.. ఇంప్లాంట్స్, ఫిల్లింగ్‌కు ఇక చెల్లు!