Lab-Grown Teeth | లండన్, ఏప్రిల్ 14: దంత సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా శాస్త్రవేత్తలు గొప్ప విజయాన్ని సాధించారు. లండన్లోని కింగ్స్ కాలేజీ, ఇంపీరియల్ కాలేజీ సైంటిస్టులు మొట్టమొదటిసారిగా ల్యాబ్లో మానవ దంతాన్ని పెంచారు. ప్రస్తుతం దంత సమస్యలతో డాక్టర్ వద్దకు వెళితే.. ఇంప్లాంట్ లేదా ఫిల్లింగ్ చేయాలనో సూచిస్తాడు.
అయితే ఇది సహజ దంతాల రూపం, పనితీరును పునరుద్ధరించటంలో విఫలమవుతున్నది. అయితే శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త పద్ధతి.. దంతాలు కోల్పోయిన వారికి కొత్త మార్గాన్ని చూపింది. ‘ఈ పద్ధతి సహజ దంతాల లక్షణాలు, విధులను అనుకరించే దంత నిర్మాణాలను సృష్టిస్తుంది’ అని అధ్యయనం పేర్కొన్నది.