Gold Trading Ban | ఆఫ్రికా దేశమైన ఘనా కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ దేశంలో విదేశీయులు బంగారం వ్యాపారం చేయకుండా నిషేధం విధించింది. ఇకపై దేశంలో విదేశీలు తవ్విన బంగారాన్ని కొనుగోలు చేయడం లేదంటే.. విక్రయించడం చేయలేరు. ఈ కొత్త రూల్ మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు ఘనా గోల్డ్ బోర్డ్ సోమవారం ప్రకటించింది. ఇకపై ఎవరైనా బంగారం వ్యాపారం చేయాలనుకుంటే కొత్తగా ఏర్పడిన ఘనా గోల్డ్ బోర్డ్ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ప్రెషియస్ మినరల్స్ మార్కెటింగ్ కంపెనీ నుంచి లైసెన్స్ పొందడం ద్వారా బంగారం వ్యాపారం చేసిన కంపెనీల లైసెన్స్‌లు ఇకపై చెల్లవని స్పష్టం చేసింది.
ఇక నుంచి తమ దేశంలో గోల్డ్బాడ్ మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పింది. చట్టం ప్రకారం.. ఇప్పుడు ఘనా గోల్డ్బోర్డ్ మాత్రమే లైసెన్స్ పొందిన చిన్న తరహా మైనర్ల నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తుందని ప్రకటనలో తెలిపింది. బోర్డు బంగారం విలువను లెక్కగట్టి ఎగుమతి చేయనున్నది. గోల్డ్బాడ్ లైసెన్స్ లేకుండా ఎవరైనా వ్యాపారం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గతంలో ఎగుమతి లైసెన్సులు కలిగిన స్థానిక, విదేశీ కంపెనీలు ఘనా గని కార్మికుల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసి విదేశాలకు పంపేందుకు అవకాశం ఉండేది. కానీ, కొత్త రూల్స్ ప్రకారం అలా చేయడం కుదరు. పార్లమెంట్ మార్చి 29న ఘనా గోల్డ్ బోర్డ్ బిల్లును ఆమోదించింది.
అధ్యక్షుడు జాన్ డ్రామణి మహామా ఏప్రిల్ 2న సంతకం చేయడంతో చట్టంగా మారింది. ఇది బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో సహాయపడనున్నది. ఈ నిర్ణయంతో ఘనా విదేశీ మారక నిల్వలు పెరుగుతాయని గోల్డ్ బోర్డ్ ప్రతినిధి ప్రిన్స్ క్వామే మింకా పేర్కొన్నారు. బంగారం అక్రమ రవాణాను ఎదుర్కోవడంల సహాయపడుతుందన్నారు. కొత్త బోర్డు ఘనా బంగారం వ్యాపారం చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రి డాక్టర్ కాస్టియల్ అటో ఫోర్సన్ తెలిపారు. బంగారం వెలికితీత, శుద్ధి చేయడం, విలువను పెంచడం, బంగారం విక్రయించడంలో బోర్డు పాత్ర ఉంటుందన్నారు. ‘గెలామ్సే’ పేరుతో పిలిచే అక్రమ మైనింగా ఘనాలో పెద్ద సమస్య.
గత సంవత్సరం ఘనా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇది ప్రముఖ పాత్ర పోషించింది. ఈ సమస్య కారణంగా గత ప్రభుత్వం చాలా వ్యతిరేకతతో పాటు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఘనా ఘనా ప్రపంచంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే. ఈ దేశాల జాబితాలో ఆరోస్థానంలో ఉంది. కానీ, ఇటీవల అక్రమ మైనింగ్ వేగంగా పెరిగింది. దాంతో నదులు, పర్యావరణానికి తీవ్రమైన ముప్పు కలిగింది. ఆర్థిక పరిమితుల కారణంగా ఉపాధి కోసం ప్రజలు అక్రమ మైనింగ్‌ను ఆశ్రయిస్తున్నారు. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం కొత్తగా ఘనా గోల్డ్ బోర్డ్‌ని తీసుకువచ్చింది.