Melinda Gates | మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో (Bill Gates) విడాకుల (Divorce)పై మెలిందా గేట్స్ (Melinda Gates) తాజాగా స్పందించారు. బిల్ గేట్స్‌తో విడిపోవడాన్ని ‘చాలా అవసరం’ అని అభివర్ణించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అత్యంత సన్నిహిత సంబంధంలో మీ విలువలను నిలబెట్టుకోలేకపోతే విడాకులు అవసరమే’ అని వ్యాఖ్యానించారు. ‘వివాహ బంధాన్ని ముగించడం చాలా చాలా కష్టం. విడిపోవాల్సిన అవసరం అప్పుడు ఏర్పడింది. జీవితంలో అది అత్యంత బాధాకరమైన విషయం. ఆ సమయంలో ఎంతో భయాందోళనకు గురయ్యాను. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను’ అని మెలిందా గేట్స్ తెలిపారు.
కాగా, గతంలో కూడా విడాలకు అంశంపై మెలిందా స్పందించిన విషయం తెలిసిందే. విడాకులకు ముందే ఆయనతో చాలా కాలం నుంచి దూరంగా ఉన్నట్లు వెల్లడించారు. విడాకులను తన జీవితంలో చోటుచేసుకున్న ‘బాధాకరమైన విషయం’గా అభివర్ణించారు. అయితే, ఆ తర్వాత మాత్రం తన జీవితం అద్భుతంగా సాగుతోందని చెప్పారు. చిన్న చిన్న పనులను సైతం తానే స్వయంగా చేసుకుంటున్నానని తెలిపారు.
1994లో బిల్‌గేట్స్, మెలిందా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వివిధ కారణాల వల్ల దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో వీరు విడాకులు తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసులో నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో బిల్‌గేట్స్ సంబంధాలు నెరపడం మెలిందాకు నచ్చలేదని, దీనిపై ఇద్దరి మధ్యా విబేధాలు వచ్చాయని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు, టాక్స్ ఎగ్గొట్టడం కోసమే విడాకులు తీసుకున్నారంటూ వీళ్లు విడిపోయినపుడు రకరకాల రూమర్స్ వచ్చాయి.
ఇక విడాకుల అనంతరం 62 ఏళ్ల పౌలా హర్డ్ (Paula Hurd)తో బిల్‌గేట్స్ డేటింగ్లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. 2023లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ, గతేడాది జరిగిన ఒలింపిక్స్, ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలు సహా పలు ఈవెంట్స్‌లో ఇద్దరూ జంటగా దర్శనమిచ్చారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఇక మెలిందా సైతం ప్రేమలో పడ్డట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీ(Jon Du Pre)తో డేటింగ్ చేస్తున్నట్టు ఒక ఆన్లైన్ టాబ్లాయిడ్ రిపోర్టు చేసింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్టు పేర్కొంది.
Also Read..
“Melinda Gates | బిల్ గేట్స్‌తో విడాకులు భయానకం.. మిలిందా గేట్స్”
“Bill Gates: బిల్ గేట్స్ ఆస్తిలో.. ఆయన పిల్లలకు దక్కేది ఒక్క శాతం మాత్రమే !”