Bill Gates | అపర కుబేరుడైన వ్యాపారవేత్త, మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ (Bill Gates) ప్రేమలో పడ్డట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. 62 ఏళ్ల పౌలా హర్డ్ (Paula Hurd)తో బిల్‌గేట్స్ డేటింగ్లో ఉన్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది. 2023లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ, గతేడాది జరిగిన ఒలింపిక్స్, ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకలు సహా పలు ఈవెంట్స్‌లో ఇద్దరూ జంటగా దర్శనమిచ్చారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పౌలా హర్డ్‌తో రిలేషన్‌షిప్‌పై బిల్‌గేట్స్ తాజాగా స్పందించారు. ఆమెను తన ‘సీరియస్ గర్ల్‌ఫ్రెండ్’గా (Serious Girlfriend) అభివర్ణించారు. ‘పౌలా అనే సీరియస్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండటం నా అదృష్టం’ అని బిల్ గేట్స్ పేర్కొన్నారు. తామిద్దరం చాలా సరదాగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
కాగా, బిల్ గేట్స్ ప్రేమలో పడ్డట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పౌలా హర్డ్ (Paula Hurd)తో గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. 2023 జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు కూడా. ఆ సమయంలో ఇద్దరూ చాలా చనువుగా కనిపించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాల్లో వీరిద్దరూ జంటగా దర్శనమిచ్చారు. బిల్ గేట్స్-పౌలా రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్నారని.. వారిది విడదీయలేని బంధం అని వారిద్దరికీ అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి తెలిపారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలపై ఈ జంట ఇప్పటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. ఈ క్రమంలో బిల్ గేట్స్ తాజా కామెంట్స్‌తో మరోసారి వీరి రిలేషన్షిప్ హాట్‌టాపిక్ అవుతోంది.
టెక్ దిగ్గజం ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ (Mark Hurd) భార్యనే ఈ పౌలా హర్డ్. క్యాన్సర్‌తో చాలాకాలం పోరాడిన మార్క్ 2019లో మరణించారు. పౌలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె చాలా చురుకుగా ఉంటున్నారట.
దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు బిల్ గేట్స్-మెలిందా దంపతులు. ఈ ఇద్దరూ 1994లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమోకానీ పెళ్లైన 27 ఏళ్ల తరువాత విడిపోయారు. టాక్స్ ఎగ్గొట్టడం కోసమే విడాకులు తీసుకున్నారంటూ వీళ్లు విడిపోయినపుడు రకరకాల రూమర్స్ వచ్చాయి.
విడాకుల అనంతరం మెలిందా సైతం ప్రేమలో పడ్డట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. మాజీ టీవీ రిపోర్టర్ జాన్ డ్యూ ప్రీ(Jon Du Pre)తో డేటింగ్ చేస్తున్నట్టు ఒక ఆన్లైన్ టాబ్లాయిడ్ రిపోర్టు చేసింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పినట్టు ఆ రిపోర్టు పేర్కొంది. కాగా, బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను భరించలేని వేదనకు గురైనట్టు మెలిందా గేట్స్ ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
Also Read..
Donald Trump | మేం గాజాను స్వాధీనం చేసుకుంటాం.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
Maha kumbha Mela | మహాకుంభమేళా.. 39 కోట్ల మంది పుణ్యస్నానాలు
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి