Melinda Gates | మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ మాజీ సతీమణి మిలిందా ఫ్రెంచ్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. 2021లో బిల్ గేట్స్ నుంచి ఆమె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తన మాజీ భర్తతో విడాకులపై ‘టైమ్స్’ మ్యాగజైన్కిచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల సమయంలో తన పరిస్థితిని వెల్లడించారు. తొలుత తాను బిల్ గేట్స్ నుంచి విడిపోయానని, 2021లో అధికారికంగా విడాకులు తీసుకున్నానని చెప్పారు. విడాకులు తీసుకున్నప్పుడు ‘భయంకరం’, ‘భయంకర పరిస్థితులు’ ఎదుర్కొన్నా అని, తర్వాత జీవితం అద్భుతంగా ఉందన్నారు. ఇదంతా తమ వ్యక్తిగతమైనా తమ పిల్లల బాధ్యతలను బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నామని చెప్పారు. ఇటువంటి నిర్ణయాలు మిమ్మల్ని చిక్కుల్లోకి నెట్టేస్తాయని పేర్కొన్నారు.
‘ప్రస్తుతం అద్భుతంగా ఉంది. ఒక నైబర్ హుడ్లో జీవిస్తున్నా, రోజూ స్టోర్ కు, మెడికల్ షాపుకీ వెళతాను. రెస్టారెంట్ కు వెళతా’ మిలింద్ గేట్స్ తెలిపారు. 2021 ఆగస్టులో బిల్ గేట్స్, మిలింద్ గేట్స్ మధ్య విడాకులు ఖరారైంది. దీంతో 27 ఏండ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన మిలింద్ గేట్.. ‘బిల్ అండ్ మిలిందా గేట్ ఫౌండేషన్’ నుంచి కూడా వైదొలిగారు.
‘నేను ఇప్పుడు నా ముగ్గురు పిల్లల గురించి ఆలోచిస్తున్నా, కానీ దీని ప్రభావం ఫౌండేషన్ పని మీద పడుతుంది. నేను, నా పిల్లలు, ఫౌండేషన్ గురించి ఆలోచిస్తే, ఒకటి చేయాలనుకుంటే మరొకటి పక్కకు వెళిపోతుంది’ అని ఆమె చెప్పారు. బిల్ గేట్స్ అండ్ మిలింద్ గేట్స్ ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో మహిళా సాధికారత కోసం పని చేస్తున్నారు. మహిళలకు హక్కులు, ఆర్థిక సాధికారత కోసం 100 కోట్ల డాలర్లతో పని చేస్తున్నట్లు మిలిందా గేట్స్ చెప్పారు. బిల్ గేట్స్, జెఫ్రీ ఎప్స్టైన్ మధ్య సాన్నిహిత్యం గురించి కూడా మిలింద్ గేట్స్ స్పందించారు. ఆమెతో బిల్ గేట్స్ అనుబంధాన్ని తాను అంగీకరించలేదన్నారు.