Bill Gates: బిల్ గేట్స్ ఆస్తిలో.. ఆయన పిల్లలకు దక్కేది ఒక్క శాతం మాత్రమే !
Bill Gates: పిల్లలకు సంక్రమించే ఆస్తి గురించి బిల్ గేట్స్ ఓ కీలక విషయాన్ని చెప్పారు. తన ఆస్తిలో కేవలం ఒక్క శాతమే మాత్రమే తమ పిల్లలకు సంక్రమిస్తుందన్నారు. పిల్లలు స్వయంగా ఎదగాలన్నారు.
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Bill Gates) ఓ కీలక విషయాన్ని వెల్లడించారు. తన పిల్లలకు తన పూర్తి ఆస్తి సంక్రమించదన్నారు. తన ఆస్తిలో కేవలం ఒక్క శాతం మాత్రమే పిలల్లకు వారసత్వ హక్కుగా వెళ్తుందన్నారు. పిల్లలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకోవాలని, వాళ్ల సక్సెస్ వాళ్లమీదే ఆధారపడి ఉంటుందని, వారసత్వ ఆస్తి కోసం వాళ్లు ఎదురుచూడవద్దు అని బిల్ గేట్స్ తెలిపారు. ఫిగరింగ్ ఔట్ విత్ రాజ్ షామానితో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన బిల్ గేట్స్ ఈ అభిప్రాయాలను వ్యక్తపరిచాడు.
బిల్ గేట్స్ ఆస్తి సుమారు 155 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆయన పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్క శాతం ఆస్తి మాత్రమే సంక్రమించనున్నది. పిల్లల్ని బాగా పెంచామని, వారికి కావాల్సిన విద్యను అందించినట్లు చెప్పారు. అయితే తన ఆస్తికి చెందిన ఎక్కువ శాతం విరాళాలకు వెళ్తుందని, వారసత్వ సంక్రమణకు చెల్లదని బిల్ గేట్స్ పేర్కొన్నాడు. తన సంపాదన, ఆస్తి .. పిల్లలపై ప్రభావం చూపకూడదన్నారు. తమ స్వంతంగా పిల్లలు సంపాదించుకోవాలన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్‌కు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆస్తి సంక్రమణ అనేది విలువలకు సంబంధించినదని, కానీ సంఖ్యలకు చెందినది కాదు అని అన్నారు. ఆర్థిక సాయాన్ని, ప్రేమను ఒక్కటిగా చూసి కన్ఫ్యూజ్ కావొద్దన్నారు. పిల్లలకు ఎటువంటి అవకాశాలు కల్పిస్తున్నారు, ఎందుకు కల్పిస్తున్నారన్న అంశాల్లో క్లారిటీ ఉండాలన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

