Trash balloons | ఉత్తర (North Korea), దక్షిణ కొరియాల మధ్య బెలూన్ వార్ కొనసాగుతోంది. పొరుగున ఉన్న దక్షిణ కొరియా (South Korea)పై ఉత్తర కొరియా వరుసగా ‘చెత్త’ దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. పెద్దఎత్తున చెత్త, ఇతర విసర్జకాలతో ఉన్న మూటలతో కూడిన బెలూన్లను (Trash balloons) సరిహద్దు వెంబడి ఎగురవేసి దక్షిణ కొరియా గనగతలంలోకి పంపుతోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ పలు మార్లు ఈ బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఇప్పటి వరకూ 5,500కిపైగా చెత్త బెలూన్లను ఉత్తర కొరియా వదిలినట్లు అంచనా.
అయితే, ఈ బెలూన్ల కారణంగా దక్షిణ కొరియాలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేలపై బెలూన్లు పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు విమానాశ్రయాలు తరచూ మూతపడుతున్నాయి. ఆ చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని (Seouls airports) రన్‌వేలను మూసివేయాల్సి వచ్చింది. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్‌పోర్టుల్లో మొత్తం రన్‌వేలను దాదాపు 20 రోజుల్లోనే మూసివేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా అధికారులు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే ఎయిర్ పోర్టులలో ఇచియాన్ విమానాశ్రయం కూడా ఒకటి. అలాంటి ఎయిర్ పోర్టును ఉత్తర కొరియా వదిలిన ‘చెత్త’ బెలూన్ల కారణంగా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 413 నిమిషాలు (ఆరు గంటలకు పైగా) మూసేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు యంగ్ బూ నామ్ పేర్కొన్నారు. సోమవారం కూడా ఈ ఎయిర్ పోర్టును దాదాపు గంటన్నర పాటు (90 నిమిషాలు) మూసివేశారని వివరించారు. ఈ బెలూన్ల కారణంగా ల్యాండింగ్ ఆలస్యం, మార్గం మళ్లింపు భయాలతో విమానాలు అత్యధిక ఇంధనాన్ని తీసుకెళ్లాల్సి వస్తోందన్నారు.
Also Read..
Kamala Harris | కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు.. ఆందోళన కలిగిస్తున్న వరుస దాడి ఘటనలు
Kangana Ranaut | సాగుచట్టాలపై వ్యాఖ్యలు వివాదం.. క్షమాపణలు కోరిన కంగనా రనౌత్