కార్చిచ్చు కోరలు చాస్తూ వ్యాపిస్తుండటంతో అమెరికాలోని కాలిఫోర్నియా సీక్వొయా నేషనల్ పార్కులో ఉన్న ప్రపంచపు అతిపెద్ద వృక్షం జనరల్ షెర్మన్‌ను కాపాడేందుకు ఫైర్‌ఫైటర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ మహావృక్షం కాండం అడుగుభాగానికి వేడిని నిలువరించగల అల్యూమినియం రేకును చుట్టారు. ఈ మహావృక్షం ఎత్తు 275 అడుగులు, చుట్టుకొలత 103 అడుగులు.