Israeli hostages | గాజా నుంచి ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు ఆదివారం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారని మిలిటరీ ప్రకటించింది. ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెలీ బందీల తల్లులు వారిని రిసీవ్ చేసుకున్నారని ఇజ్రాయెలీ మీడియా తెలిపింది. గాజా నుంచి బయలుదేరి ఇజ్రాయెల్ సరిహద్దులకు వచ్చిన రెడ్ క్రాస్ వాహనాల నుంచి ముగ్గురు బందీలు నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలను ఖతార్ కేంద్రంగా పని చేస్తున్న ఆల్ జజీరా ప్రసారం చేసింది. ఇజ్రాయెలీ బందీలు సొంత గడ్డపై అడుగు పెట్టగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ బందీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. బందీల విడుదల దృశ్యాలను వీక్షించేందుకు టెలీ అవీవ్‌లో వేల సంఖ్యలో ప్రజలు గుమి కూడారు. ఇందుకోసం రోడ్లపై పలు చోట్ల పొడవైన స్క్రీన్లు ఏర్పాటు చేశారు.