Sunita Williams | భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Williams) దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూమికి చేరిన రెండు వారాల తర్వాత సునీత ఓ ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. తన పెంపుడు శునకాలతో (Pet Dogs) సరదాగా గడిపారు. ఇంటి బయట పెంపుడు శునకాలు గన్నర్, గోర్బీతో ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోని సునీతా విలియమ్స్ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఎనిమిది రోజుల మిషన్ కోసం అనివెళ్లి దాదాపు తొమ్మిది నెలల పాటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమిపైకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. గత నెల 19న తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్ కంపెనీకి చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆస్ట్రోనాట్స్ భూమికి చేరారు.
Best homecoming ever! pic.twitter.com/h1ogPh5WMR
— Sunita Williams (@Astro_Suni) April 1, 2025
Also Read..
Sunita Williams: హిమాలయాలు అద్భుతం: సునీతా విలియమ్స్
NASA | బోయింగ్ స్టార్‌లైనర్‌లో మళ్లీ ప్రయాణానికి సిద్ధం.. ప్రకటించిన సునీతా విలియమ్స్..!