Donald Trump : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్.. రెండు దేశాలూ తక్షణమే యుద్ధం ఆపాలని, కాల్పుల విరమణ పాటించాలని కోరాడు. ఇప్పటికే శాంతి చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి ముగిసిపోయే అవకాశం ఉందని, అతిత్వరలోనే ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం తన సోషల్ మీడియా అకౌంట్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దాడులు చేసుకోవడం ఆపి, చర్చలకు సిద్ధం కావాలని ట్రంప్ సూచించాడు. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గించడానికి తాను ప్రయత్నిస్తున్నానని, అయితే, ఉద్రిక్తతలు తగ్గకపోతే మళ్లీ సైనిక చర్య తప్పకపోవచ్చని ట్రంప్ అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించినట్లు ట్రంప్ చెప్పారు. చర్చలు సజావుగా సాగడానికి, శాంతి ఒప్పందం కుదరడానికి నెతన్యాహును ఒప్పించినట్లు ట్రంప్ వెల్లడించారు. చర్చలు తుది దశలో ఉన్నాయని, బుధవారం లోపు శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ తెలిపారు.
ఇరాన్ జరిపిన మిస్సైల్ దాడుల వల్లే మళ్లీ ఉద్రిక్త పరిస్తితులు తలెత్తాయని, దీంతో ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగిందని ట్రంప్ వెల్లడించారు. మరోవైపు ఇరాన్ మళ్లీ చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో లెబనాన్‌లోని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడులను కూడా ట్రంప్ ఖండించారు. లెబనాన్‌పై సైనిక చర్యలు ఆపేయాల్సిందిగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించానని ట్రంప్ తెలిపారు. దీనికి ఇజ్రాయెల్ వెంటనే అంగీకరించిందన్నారు.