శ్రీలంకలో నూతన మంత్రివర్గం
ప్రజాగ్రహానికి దిగొచ్చిన రాజపక్స
కొలంబో, ఏప్రిల్ 18: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రజాగ్రహానికి దిగొచ్చారు. ఇటీవల రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ప్రధాని మహింద రాజపక్స మినహా, కుటుంబసభ్యులు ఎవరూ లేకుండా 17 మందితో కొత్త క్యాబినెట్‌ను ఏర్పాటు చేశారు. అంతకుముందు మంత్రులుగా ఉన్న చమల్ రాజపక్స, మహింద కుమారుడు నమల్ రాజపక్స పాటు సహాయ మంత్రిగా వ్యవహరించిన మేనల్లుడు శశీంద్రకు తాజా క్యాబినెట్లో చోటు కల్పించలేదు.
దేశం లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గొటబయ, మహింద తప్ప క్యాబినెట్ సభ్యులందరూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. క్యాబినెట్లో భాగం కావాలని ప్రతిపక్షాలను ఆహ్వానించగా తిరస్కరించాయి. సంక్షోభానికి బాధ్యత వహిస్తూ గొటబయ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.