హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు, ప్రజల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిషరించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీఎస్‌ఈసీ) క్లస్టర్లవారీగా నోడల్ అధికారులను నియమించింది. ఈ మేరకు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడటంతోపాటు, ఫిర్యాదులను తక్షణమే పరిషరించడం, అధికారుల దృష్టికి తీసుకెళ్లడం నోడల్ అధికారుల బాధ్యత అని ఎస్ఈసీ కార్యదర్శి జీ లింగ్యానాయక్ శనివారం జారీచేసిన ఉత్తర్వుల్లో పేరొన్నారు.
మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కోసం నియమితులైన అధికారులకు శనివారం వర్చువల్‌గా శిక్షణ ఇచ్చా రు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిషరించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ హెల్ప్‌లైన్ నంబర్ 92475 97066ను అందుబాటులోకి తీసుకొచ్చిం ది. సోమవారం నుంచి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజల ఫిర్యాదులను స్వీకరించడం, పరిషరించడం కోసం అధికారులు అందుబాటులో ఉంటారు.