Sri Lanka | రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న పొరుగు దేశమైన శ్రీలంకలో (Sri Lanka) దేశాధ్యక్ష పదవికి నేడు ఎన్నికలు (sri lanka presidential election) జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనుంది. ఓటర్లు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
మొత్తం 38 మంది అభ్యర్థులు ఈ ఎన్నికలో పోటీ పడుతున్నారు. సుమారు 13,400 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దాదాపు 1.70 కోట్ల మంది ప్రజలు నేరుగా ఓటు వేసి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. ఒక్కో ఓటరు ముగ్గురికి ఓటు వేయవచ్చు. 50% ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి విజయం సాధిస్తారు. కాగా, ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి.
శ్రీలంక అధ్యక్ష పదవి కోసం 38 మంది పోటీ పడుతున్నారు. అయితే ప్రధాన పోటీ మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు, యునైటెడ్ నేషనల్ పార్టీ(United National Party)కి చెందిన రణిల్ విక్రమ సింఘే, నేషనల్ పీపుల్స్ పవర్(National Peoples Power) పార్టీకి చెందిన అనుర కుమార దిస్సనాయకే, సమగి జన బలవేగాయ పార్టీ (Samagi Jana Balawegaya Party) నుంచి ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస (Sajith Premadasa) మధ్యనే నెలకొన్నది. 1982 తర్వాత శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒపీనియన్ పోల్స్ ప్రకారం త్రిముఖ పోరులో అనూరకే స్పష్టమైన మొగ్గు కనిపిస్తోందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ త్రిముఖ పోరులో గెలుపెవరిదో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.
Also Read..
Manipur | మయన్మార్ నుంచి 900 మంది మిలిటెంట్ల చొరబాటు.. మణిపూర్లో హై అలర్ట్
Saripodhaa Sanivaaram OTT | ఓటీటీలోకి నాని సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
Mobile internet services | పోటీ పరీక్ష.. ఆ రాష్ట్రంలో రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు బంద్