మంగళవారం 26 మే 2020
International - May 03, 2020 , 14:41:11

ద‌క్షిణ‌ కొరియాలో మ‌ళ్లీ పెరుగుతున్నక‌రోనా కేసులు

ద‌క్షిణ‌ కొరియాలో మ‌ళ్లీ పెరుగుతున్నక‌రోనా కేసులు

ద‌క్షిణ‌ కొరియాలో త‌గ్గుముఖం ప‌ట్టింద‌నుకున్నా క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ  వ్యాప్తి చెందుతుంది. గ‌తంలో ఉన్నంత ఉదృతంగా లేక‌పోయినా మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అక్కడ కొత్తగా 13 కరోనావైరస్ కేసులు న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అయితే వాటిలో 10 కేసులు విదేశాల నుంచి వచ్చిన వారివ‌ల్ల‌నే సంభవించిన‌ట్లు తెలిపారు. వాస్తవానికి దక్షిణకొరియాలో రెండు వారాలకు పైగా 15 కంటే తక్కువ కేసులు మాత్ర‌మే న‌మోదైన‌ట్లు పేర్కొంది. కాగా లాక్‌డౌన్‌ నియమాలను సడలించాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం దక్షిణకొరియాలో మొత్తం పాజిటివ్ కేసులు 10,793 గా ఉండగా.. ఇందులో రికార్డు స్థాయిలో 9,183 మంది కోలుకున్నారు. కేవలం 250 మంది మాత్రమే మరణించటం ఊర‌ట‌నిచ్చే అంశం.


logo