Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడిన విషయం తెలిసిందే. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారింది. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి తన సోదరి, ఇతర సన్నిహితులతో కలిసి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం హసీనా సోదరులు సహా ఆమె టీమ్ మొత్తం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో తాత్కాలిక ఆశ్రయం పొందుతున్నారు. అయితే, తాజాగా హసీనా టీమ్ భారత్‌ను వీడినట్లు (Hasinas team members leave from India ) తెలిసింది. ఆమె టీమ్ మొత్తం కొత్త గమ్యస్థానాలను వెతుక్కుంటూ వెళ్లిందని ప్రభుత్వ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారంతా తెలియని ప్రదేశానికి (undisclosed locations) వెళ్లినట్లు సదరు కథనాలు వెల్లడిస్తున్నాయి.
కాగా, రాజీనామా అనంతరం హసీనా తన సోదరితో కలిసి సోమవారం సాయంత్రం భారత్‌లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత ప్రభుత్వ సహకారంతో హసీనా లండన్ వెళ్లాలని భావించారు. లండన్‌లో రాజకీయ శరణార్థిగా వెళ్లాలనుకున్నారు. అయితే, అందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ ఆసక్తిగా లేనట్లు తెలిసింది. దీంతో హసీనా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ ఆరేబియా దేశాలతో ఆశ్రయం కోసం షేక్ హసీనా సంప్రదింపులు కూడా జరిపారు. దీంతో పాటు తమ కుటుంబసభ్యులు నివసించే అమెరికా, ఫిన్‌ల్యాండ్ దేశాలతోనూ హసీనా ఆమె టచ్‌లో ఉన్నట్లు తెలిసింది.
Also Read..
“Bangladesh crisis | బంగ్లాలో అస్థిర పరిస్థితులు.. భారత వీసా సెంటర్లు మూసివేత”
“Muhammad Yunus | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం”
“Sheikh Hasina | ఈ కష్టసమయంలో మా అమ్మను చూడలేకపోతున్నా.. హసీనా కుమార్తె భావోద్వేగ పోస్ట్”