Sheikh Hasina | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేశారు. అనంతరం ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లాదేశ్ మీదుగా భారత్ (India) చేరుకున్నట్లు తెలిసింది.
తాజా సమాచారం మేరకు సోదరితో కలిసి షేక్ హసీనా త్రిపుర రాష్ట్రం అగర్తల (Agartala)లో ల్యాండ్ అయినట్లు తెలిసింది. హసీనా రాకను త్రిపుర పోలీసులు (Tripura Police) నిర్ధరించినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాలో ఆందోళన నేపథ్యంలో రాజధాని ఢాకాలోకి ప్యాలెస్ నుంచి ఆమె మధ్యాహ్నం 2:30 గంటలకు ఆర్మీ ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. తాజాగా అగర్తలలో ల్యాండ్ అయినట్లు త్రిపుర పోలీసులు నిర్ధరించినట్లుగా జాతీయ మీడియా పేర్కొంది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఆర్మీ రంగంలోకి దిగింది. దేశంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ‘ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం నడుపుతుంది. దేశంలో తిరిగి శాంతిని నెలకొల్పుతాం. ప్రజలు సంయమనం పాటించాలి. తాత్కాలిక ప్రభుత్వం పాలనను పర్యవేక్షిస్తుంది. అన్ని రాజకీయా పార్టీలను సంప్రదిస్తాం. సంక్షోభానికి పరిష్కారం కనుగొంటాం. విద్యార్థులు నిరసనలు ఆపాలని కోరుతున్నాం’ అని బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది.
బంగ్లాలో అదుపుతప్పిన పరిస్థితి
బంగ్లాదేశ్ (Bangladesh)లో పరిస్థితి అదుపుతప్పింది. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు ఆయుధాలను చేతపట్టి వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లపై అధికార పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు.
ఆదివారం మొదలైన ఈ అల్లర్లు సోమవారం రెండో రోజు కూడా కొనసాగాయి. ఇవాళ వేలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టించారు. జాతిపిత షేక్ ముజిబుర్ విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్ను ముట్టడించారు. కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. రెండు రోజులుగా సాగుతున్న ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 300 మందికిపైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా నివేదించింది.
Also Read..
Bangladesh | బంగ్లాలో అదుపుతప్పిన పరిస్థితి.. దేశంలో సైనిక పాలన
Sheikh Hasina: రాజీనామా చేసిన షేక్ హసీనా ఎక్కెడికి వెళ్లారు?
Bangladesh: బంగ్లాదేశ్లో రక్తపాతం సృష్టస్తున్న ఆ రిజర్వేషన్ వ్యవస్థ ఏంటో తెలుసా?