Car Drives Into Crowd | జర్మనీ (Germany)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుతో జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మ్యూనిచ్ (Munich) నగరంలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది.
జర్మన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ (Munich central train station) సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ కారుతో జనంపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఘటన జరిగిన నగరంలో శుక్రవారం భద్రతా సదస్సు జరగాల్సి ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు హాజరుకానున్నారు. ఈ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ఒక రోజు ముందు ఈ ఘటన జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read..
Adani Green Energy: శ్రీలంక పవర్ ప్రాజెక్టు నుంచి అదానీ కంపెనీ ఉపసంహరణ
Viral News | అలిసిపోతే పెగ్గు.. హ్యాంగోవర్ అయితే సెలవు.. ఉద్యోగులకు జపాన్ కంపెనీ బంపరాఫర్!