Viral News | అలిసిపోతే పెగ్గు.. హ్యాంగోవర్ అయితే సెలవు.. ఉద్యోగులకు జపాన్ కంపెనీ బంపరాఫర్!
Viral News | ఉద్యోగులు పని చేస్తూ అలిసిపోతే ఆఫీస్‌లోనే పెగ్గేయొచ్చు. మందు ఎక్కువై హ్యాంగోవర్ అయితే మరునాడు ఆఫీస్‌కు లేటుగా రావొచ్చు. అవసరమైతే సెలవు తీసుకోవచ్చు. జపాన్‌కు చెందిన ట్రస్ట్ రింగ్ కో అనే కంపెనీ ఉద్యోగులకు ఇలాంటి అసాధారణ ఆఫర్లు ఇస్తున్నది.
Viral News | టోక్యో : ఉద్యోగులు పని చేస్తూ అలిసిపోతే ఆఫీస్‌లోనే పెగ్గేయొచ్చు. మందు ఎక్కువై హ్యాంగోవర్ అయితే మరునాడు ఆఫీస్‌కు లేటుగా రావొచ్చు. అవసరమైతే సెలవు తీసుకోవచ్చు. జపాన్‌కు చెందిన ట్రస్ట్ రింగ్ కో అనే కంపెనీ ఉద్యోగులకు ఇలాంటి అసాధారణ ఆఫర్లు ఇస్తున్నది. ఒసాకా కేంద్రంగా పని చేసే ఈ చిన్న ఐటీ కంపెనీ.. సంప్రదాయ ఆఫీస్ కల్చర్‌ను బద్దలుకొడుతున్నది. కొత్త రూల్స్‌తో ఉద్యోగులను ఆకట్టుకుంటున్నది. సాధారణంగా ఐటీ ఉద్యోగులకు జీతాలు భారీగా ఉంటాయి. ఈ చిన్న సంస్థ భారీ వేతనాలను ఇచ్చుకోలేదు.
దీంతో ప్రతిభ కలిగిన కొత్త ఉద్యోగులు తమ సంస్థలో చేరేలా, చేరిన వారు నాలుగు కాలాల పాటు కొనసాగేలా ఆకర్షించేందుకు తమ పని విధానాన్ని ఇలా మార్చేశామని కంపెనీ సీఈఓ తుకుయా సుగియురా చెప్తున్నారు. ఉద్యోగులకు కార్యాలయంలోనే ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని, తానూ అప్పుడప్పుడు వారితో కలిసి చిల్ అవుతానని అంటున్నారు. కొత్త ఉద్యోగులకు స్వయంగా డ్రింక్ ఇచ్చి కంపెనీలోకి ఆహ్వానిస్తానని చెప్తున్నారు. తమ విధానం వల్ల పని, వినోదం మధ్య సమతుల్యం ఏర్పడుతుందన్నారు.
7 అయ్యిందా? పని ఆపేయ్.. ఉద్యోగులకు ఓ సంస్థ కఠిన నిబంధన
ముంబై : వారానికి 70 గంటలు పని చేయాలని, 90 గంటలు పని చేయడంతో పాటు ఆదివారాలూ ఆఫీసులకు రావాలని పెద్ద కంపెనీల బాసులు చెప్తుంటే.. రెడ్ ఇన్ ది వైట్ అనే యాడ్ ఏజెన్సీ టైమ్‌కు పని ముగించాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నది. తమ ఉద్యోగులు రాత్రి 7 అయ్యిందంటే కచ్చితంగా లాగ్ఆఫ్ చేయాలని చెప్తామని సంస్థ ఫౌండర్ ప్రణిత బజోరియా తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

