Donald Trump | ఎక్స్‌పై ట్రంప్ దావా.. 10 మిలియన్ డాలర్లతో సెటిల్మెంట్కు సిద్ధమైన ఎలాన్ మస్క్..!
Donald Trump | అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2021లో క్యాపిటల్ హిల్స్‌పై దాడి నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Donald Trump | అమెరికాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2021లో క్యాపిటల్ హిల్స్‌పై దాడి నేపథ్యంలో ట్రంప్ (Donald Trump) సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌కు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (X) ఖాతాలపై ఆయా సంస్థలు నిషేధం విధించాయి. దీంతో ఆ సంస్థలపై ట్రంప్ అప్పట్లోనే దావా (lawsuit) వేశారు. ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతో ఆయా సంస్థలు సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన ‘ఎక్స్’ ట్రంప్‌కు 10 మిలియన్ డాలర్లు (రూ.86 కోట్లు) చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిసింది.
కాగా, 2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2021 జనవరి 6న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో సమావేశమైంది. ఆ సమయంలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియా ఖాతాలు ఎక్స్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం విధించారు.
దీంతో ట్రంప్ ఆయా సంస్థలపై దావా వేశారు. అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు. ప్రస్తుతం ట్రంప్ మరోసారి అధికారం చేపట్టడంతో వీటిని సెటిల్ చేసుకునేందుకు ఆయా సంస్థలు ముందుకొచ్చాయి. ఇటీవలే మెటా సంస్థ 25 మిలియన్ డాలర్లకు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మస్క్‌కు చెందిన ఎక్స్ సైతం ట్రంప్‌తో డీల్‌కు సిద్ధమైనట్లు అమెరికా మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
Also Read..
Viral News | అలిసిపోతే పెగ్గు.. హ్యాంగోవర్ అయితే సెలవు.. ఉద్యోగులకు జపాన్ కంపెనీ బంపరాఫర్!
యుద్ధం ముగింపుపై పుతిన్‌తో మాట్లాడా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

