అమెరికాలో ఆశ్రయం కోసం ఆరాటం
అమెరికాను ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘అనాథరైజ్డ్ ఇండియన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్: ట్రెండ్స్ అండ్ డెవెలప్‌మెంట్స్' పేరుతో వీరు నివేదికను విడుదల చేశారు.
- పెద్దఎత్తున శరణు కోరుతున్న భారతీయులు
- ఐదేండ్లలో 466 శాతం పెరిగిన సంఖ్య
వాషింగ్టన్, ఫిబ్రవరి 12: అమెరికాను ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘అనాథరైజ్డ్ ఇండియన్స్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్: ట్రెండ్స్ అండ్ డెవెలప్‌మెంట్స్’ పేరుతో వీరు నివేదికను విడుదల చేశారు. 2018లో దాదాపు 9 వేల మంది భారతీయులు అమెరికాను ఆశ్రయం కోరగా, 2023లో 51 వేల మంది కోరారని, అంటే ఐదేండ్లలో 466 శాతం పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారు తమ సొంత దేశంలో హింసను కారణంగా చూపి ఆశ్రయం కోరేందుకు అమెరికా వలస విధానం అనుమతిస్తుంది.
అమెరికా తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది భారతీయులు ఆశ్రయం కోరుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. 2023లో కెనడాను 11,500 మంది భారతీయులు ఆశ్రయం కోసం అభ్యర్థించినట్టు వెల్లడించారు. అయితే, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) 2022 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా తగ్గింది. వీరి జనాభా 2016లో 5,60,000 ఉండగా 2022 నాటికి 2,20,000 ఉన్నట్టు డీహెచ్ఎస్ అప్పట్లో వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

