Ride Crashes | సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ఓ అమ్మూజ్మెంట్ పార్క్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫెయిర్ గ్రౌండ్ రైడ్ (Fairground Ride) ఒక్కసారిగా విరిగిపోయింది (Ride Crashes). ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
తైఫ్‌లోని గ్రీన్ మౌంటైన్ పార్క్‌లో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ సందర్శనకు వచ్చిన వారు ఎంతో సరదగా రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఫెయిర్ గ్రౌండ్ రైడ్ మధ్య భాగం ఒక్కసారిగా విరిగి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు గాల్లోకి ఎగిరి నేలపై పడిపోయారు. ఈ ఘటనలో దాదాపు 25 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఖలీజ్ టైమ్స్ నివేదించింది. సమాచారం అందుకున్న సెక్యూరిటీ, ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సదరు నివేదిక పేర్కొంది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🎥 #فيديو |
سقوط إحدى ألعاب الملاهي في منتزه #الجبل_الأخضر بمنطقة #الهدا في الطائف، ما أسفر عن إصابة 23 شخصاً، من بينهم 3 حالات خطيرة.#متداول#حائل_الآن pic.twitter.com/suioYFe00J
— حائل الآن (@HailN24) July 31, 2025
Also Read..
Earthquake | రష్యాలో మరోసారి భారీ భూకంపం
Turbulence | విమానం గాల్లో ఉండగా భారీ కుదుపులు.. 25 మంది ప్రయాణికులకు గాయాలు
Klyuchevskoy volcano | భారీ భూకంపం తర్వాత.. రష్యాలో బద్ధలైన క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం