Earthquake | రష్యా (Russia)లో మరోసారి భారీ భూకంపం (Earthquake) సంభవించింది. కురిల్ ఐలాండ్ (Kuril Island)లో గురువారం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 6.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. నిన్న కమ్చట్కా ద్వీపకల్పంలో (Kamchatka peninsula) భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అదే ప్రాంతానికి 200 మైళ్ల దూరంలో తాజాగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వరుస భూకంపాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే, తాజా భూకంపం కారణంగా ఎలాంటి సనామీ హెచ్చరికలూ జారీ కాలేదు.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం (Kamchatka peninsula)లో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే 4.4 అంతకంటే ఎక్కువ తీవ్రతతో 125 సార్లు భూమి కంపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. వాటిలో మూడు 6.0 తీవ్రతకంటే ఎక్కువగా నమోదైనట్లు పేర్కొంది. రష్యాలో ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి.
భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతోపాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తయిన అలలు వరుసగా దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రదేశాలవైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భూకంపం, సునామీ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు ఎటువంటి సమాచారం వెలువడలేదు.
Also Read..
సునామీ భయం భయం.. రష్యాను వణికించిన భారీ భూకంపం
Klyuchevskoy volcano | భారీ భూకంపం తర్వాత.. రష్యాలో బద్ధలైన క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం