రియాద్: యెమెన్ సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. యూఏఈ మద్దతున్న వేర్పాటువాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు శుక్రవారం జరిపిన వైమానిక దాడుల్లో ఏడుగురు మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు.
హద్రమౌత్ ప్రావిన్స్‌లోని అల్-ఖసా ప్రాంతంలోని మిలిటరీ శిబిరం లక్ష్యంగా కూడా ఈ దాడులు జరిగినట్టు హద్రమౌత్‌లోని సదరన్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ హెడ్ అబ్దుల్ మాలిక్ పేర్కొన్నట్టు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది. సౌదీతో సరిహద్దును పంచుకుంటున్న హద్రమౌత్‌లోని వేర్పాటు వాదుల శిబిరాలను, ఆ ప్రాంతాన్ని నియంత్రణలోకి తెచ్చుకునేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్నది.