Russian Airstrike | ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా మరోసారి భీకర దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలో గల షోస్ట్కాలోని రైల్వే స్టేషన్‌పై డ్రోన్లతో (Russian Airstrike) విరుచుకుపడింది. అదే సమయంలో రాజధాని కీవ్ (Kyiv) వెళ్తున్న ప్యాసింజర్ రైలు (passenger train)ను డ్రోను తాకింది. ఈ ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దాడితో అప్రమత్తమైన అత్యవసర సేవల సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ దాడిలో చాలా మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాంతీయ గవర్నర్ ఒలేహ్ హ్రిహోరోవ్ (Oleh Hryhorov) తెలిపారు. అయితే, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అనేక మంది గాయపడినట్లు చెప్పారు. డ్రోన్ దాడిలో రైలు కోచ్ కాలిపోతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైద్యులు, రెస్క్యూ టీమ్ ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
On the afternoon of October 4, the Russians attacked a passenger train from Shostka (#Sumy) to #Kyiv. About 30 passengers were injured. Preliminary, employees of “Ukrzaliznytsia” were also at the scene of the attack.https://t.co/nOv7ROUrno pic.twitter.com/msl4YoW49Y
— Babel.ua: Ukraine at war (@UaBabel) October 4, 2025
Also Read..
Israel | ట్రంప్ సూచనలు బేఖాతరు.. గాజాపై ఇజ్రాయెల్ దాడి.. ఆరుగురు మృతి
Karur Stampede | కరూర్ ఘటనే అవకాశంగా బీజేపీ ఎన్నికల వ్యూహం.. టీవీకేకి కీలక హామీ..?
Nirav Modi | పీఎన్బీ రుణ ఎగవేత కేసులో కీలక పరిణామం.. నవంబర్ 23న భారత్‌కు నీరవ్ మోదీ..?