Russia vs Ukraine | ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడి.. 17 మంది మృతి, 80 మందికి గాయాలు
Russia vs Ukraine | రష్యా - ఉక్రెయిన్ (Russia - Ukraine) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి తమ ఉక్రెయిన్‌లోని జైలుపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 17 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు.
Russia vs Ukraine : రష్యా – ఉక్రెయిన్ (Russia – Ukraine) దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సోమవారం అర్ధరాత్రి తమ ఉక్రెయిన్‌లోని జైలుపై రష్యా వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 17 మంది ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 80 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్ అధికారులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ జపోర్జియా ప్రాంతంలోని జైలుపై ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. బిలెన్కివ్స్కాలోని మరో కాలనీపై కూడా ఈ దాడుల ప్రభావం కన్పించిందని పేర్కొన్నారు. దాడిలో జైలు డైనింగ్ హాలుతో సహా పరిపాలనా, క్వారంటైన్ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నాయని వెల్లడించారు. మరో మూడంతస్తుల భవనం పాక్షికంగా దెబ్బతిన్నదని, ప్రసూతి ఆస్పత్రితో సహా పలు ఆస్పత్రుల్లోని వైద్య సౌకర్యాలు నాశనమయ్యాయని తెలిపారు.
ఈ దాడుల సమయంలో ఖైదీలు ఎవరూ జైలు నుంచి తప్పించుకోలేదని అధికారులు స్పష్టంచేశారు. దాడిని తాము తీవ్రంగా ఖండిస్తు్న్నామని పేర్కొన్నారు. జైళ్ల లాంటి పౌరుల మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. రష్యా ప్రయోగించిన వాటిల్లో 32 డ్రోన్లను అడ్డుకున్నామని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. కాగా రష్యా – ఉక్రెయిన్ల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతోంది.
పరస్పరం డ్రోన్ల దాడులతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపి శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా శాంతిచర్చలకు వచ్చేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇటీవల 50 రోజులు గడువు ఇచ్చారు. తాజాగా ఆ గడువును కూడా ఆయన కుదించారు. మరో 10-12 రోజుల్లో శాంతిచర్చలు కొలిక్కి రాకపోతే ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు మరింత పెంచుతానని హెచ్చరించారు.
Read More >>
అర్ధరాత్రి ప్రియురాలి కోసం వెళ్లి గ్రామస్తుల చేతిలో తన్నులు తిన్న ప్రియుడు
బీహార్ ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగితే జోక్యం చేసుకుంటాం : సుప్రీంకోర్టు
టెర్రరిస్టుల ఏరివేతలో ఆ రెండు ఆపరేషన్‌లది కీలక పాత్ర : ప్రధాని మోదీ
అరెస్ట్ చేయాల్సింది గూండాలను.. సన్యాసినిలను కాదు.. బీజేపీపై శశిథరూర్ ఫైర్
హోంమంత్రి అమిత్ షా వైఫల్యంవల్లే పహల్గాం ఉగ్రదాడి : గౌరవ్ గొగోయ్
‘వాళ్లు ఎవరో ఏందో నాకైతే తెల్వదు’.. పహల్గాం ఉగ్రవాదుల హతంపై ఫరూఖ్ అబ్దుల్లా
నా చేతులారా వాళ్లను కాల్చి చంపాలనుకునేదాన్ని.. ఉగ్రవాదుల హతంపై పహల్గాం మృతుడి భార్య.. Video
ఛత్తీస్‌గఢ్ భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

