ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యలను పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా దీనిపై మరోసారి స్పందించింది. రష్యా నుంచి వచ్చే ఆయిల్, గ్యాస్ ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. రష్యా నుంచి ఈ ఉత్పత్తులు దిగుమతి చేసుకోవద్దంటూ నిషేధం విధించారు.
ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రస్యా డిప్యూటీ పీఎం అలెగ్జాండ్ నొవాక్ మాట్లాడుతూ.. రష్యా నుంచి భారత్కు ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 1 బిలియన్ డాలర్లు చేరుకున్నాయని తెలిపారు. అంతేకాదు,
‘‘భవిష్యత్తులో రష్యా గ్యాస్, ఆయిల్ రంగంలో భారత్ నుంచి మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నాం’’ అని చెప్పారు. రష్యా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై యూరోపియన్ దేశాలు కూడా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.