ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి పశ్చిమ దేశాల ఆగ్రహం ఎదుర్కొంటున్న రష్యా ఉన్నత వర్గాలు.. భయంకరమైన ప్లాన్ వేస్తున్నాయట. ఈ విషయాన్ని ఉక్రెయిన్ రక్షణశాఖకు చెందిన ఇంటెలిజన్స్ విభాగం చీఫ్ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ఉన్నత వర్గాలన్నీ కలిసి పుతిన్‌ను ఎలాగోలా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.
యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక పరిస్థితిపై చూపిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొనే వాళ్లంతా ఈ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. దీనికోసం పుతిన్‌కు విషం పెట్టాలా? లేక అనారోగ్యం వచ్చేలా చేయాలా? లేదంటే మరేదైనా యాక్సిడెంట్లో చంపేయాలా? అని ఆలోచిస్తున్నారట.
అంతేకాదు, పుతిన్ తర్వాత రష్యా అధ్యక్ష పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలో కూడా ఈ ఉన్నత వర్గం ఒక నిర్ణయానికి వచ్చేసిందని ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ అన్నారు. పుతిన్‌కు చాలా దగ్గరి స్నేహితుడు, రష్యా రక్షణ విభాగం (ఎఫ్ఎస్బీ) డైరెక్టర్ బోర్టినికోవ్ను తర్వాతి అధ్యక్షుడిగా అనుకుంటున్నారట.
బోర్టినికోవ్ కూడా పుతిన్‌లాగే రష్యా గూఢచారి. ఇద్దరూ కలిసే సొసైటీలో ఎదిగారు. పుతిన్ అధ్యక్షుడైన తర్వాత బొర్టినికోవ్.. రష్యా రక్షణ విభాగం (ఎఫ్ఎస్బీ) డైరెక్టర్‌గా పదవి చేపట్టాడు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. మిలటరీ విషయాల్లో బోర్టినికోవ్ సలహాలు, సూచనలకు పుతిన్ చాలా విలువనిస్తాడట.
కానీ ఉక్రెయిన్‌తో జరిగిన యుద్ధంలో చెచెన్ ఫైటింగ్ స్క్వాడ్రన్‌కు ఎదురైన భారీ నష్టాల విషయంలో పుతిన్‌కు బోర్టినికోవ్పై ఆగ్రహం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరి మద్య సంబంధాలు కూడా చెడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పుతిన్‌ను తప్పించి, బోర్టినికోవ్ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెడితే.. అతను పశ్చిమ దేశాలతో దేశ సంబంధాలను మళ్లీ మెరుగు పరుస్తాడని రష్యన్ ఉన్నత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.