కీవ్: ఉక్రెయిన్పై రష్యా అతిపెద్ద వైమానిక దాడి జరిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ చరిత్రలోనే ఇది అతిపెద్ద దాడి అని అధికారులు తెలిపారు. 477 డ్రోన్లు, డెకాయ్లు, 60 క్షిపణులతో రష్యా విరుచుకుపడినట్టు చెప్పారు. అయితే వాటిలో చాలావాటిని కూల్చివేశామని తెలిపారు.
ఇంత భారీ వైమానిక దాడి ఎప్పుడూ జరగలేదని ఉక్రెయిన్ వైమానిక దళ కమ్యూనికేషన్స్ హెడ్ యూరీ ఇన్నాట్ తెలిపారు. ఇస్తాంబుల్లో జరిగే ముఖాముఖీ శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరునాడే ఈ భారీ దాడి జరగడం గమనార్హం.