ఆదివారం 31 మే 2020
International - Apr 23, 2020 , 18:53:57

డిగ్రీ పట్టా అందుకున్న రోబో!

 డిగ్రీ పట్టా అందుకున్న రోబో!

క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా కొలంబియాలో గ్రాడ్యుయేష‌న్ వేడుక‌లు ర‌ద్దు అయ్యాయి. లాక్‌డౌన్‌లో స్టూడెంట్స్ కూడా ఈ వేడుక‌కి హాజ‌రుకాలేరు కాబ‌ట్టి వాటిని వాయిదా వేయ‌కుండా వినూత్నంగా ఆలోచించారు. ఎలాగైనా పట్టాల పంపిణీ చేయాలనుకున్నారు.  స్టూడెంట్స్‌కు ఇవ్వాల్సిన డిగ్రీ ప‌ట్టాను రోబోకు ఇచ్చారు. ఆ స‌మ‌యంలో రోబోకు ముందుభాగంలో టాబ్‌ను అమ‌ర్చారు. ఏ విద్యార్థి అయితే పట్టా అందుకుంటాడో అతను ఇంటి నుంచి ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతాడు. మాట్లాడటం పూర్త‌య్యాక స్టూడెంట్ త‌ర‌పున రోబో డిగ్రీ పట్టా అందుకుంటుంది. దీన్ని చూసిన వారంతా వాళ్లే డిగ్రీ అందుకుంటున్న‌ట్లు భావిస్తున్నారు. కొలంబియాలో 4,000కి పైగా క‌రోనావైర‌స్ కేసులు వ‌చ్చాయి. అందులో 200 మంది మ‌ర‌ణించారు. ఈ వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ స‌మ‌యంలో ఇది చాలా మంది ఐడియా అని నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.logo