Vladimir Putin | ఇరాన్ (Iran)పై అమెరికా దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని మూడు అణు కేంద్రాలు లక్ష్యంగా బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా విరుచుకుపడింది. అయితే, ఇరాన్‌కు సుదీర్ఘకాలం మిత్రదేశంగా ఉన్న రష్యా (Russia) మాత్రం టెహ్రాన్‌కు సాయం అందించేందుక ఇప్పటి వరకూ ముందుకురాలేదు. దీంతో ఈ విషయంలో రష్యాపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) తాజాగా స్పందించారు.
రష్యా – ఇరాన్ (Russia-Iran) దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నప్పటికీ.. రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉన్నట్లు పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మాట్లాడుతూ.. ఒకప్పటి సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్‌కు చెందిన దాదాపు రెండు మిలియన్ల మంది ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నట్లు చెప్పారు. తమ దృష్టిలో ఇప్పుడు అది రష్యన్ మాట్లాడే దేశమన్నారు. అందుకే ఈ వివాదంలో తటస్థంగా ఉండేందకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ వివరించారు.
Also Read..
Iran | ట్రంప్.. యుద్ధం ప్రారంభించింది మీరే కావొచ్చు : ఇరాన్ ఆర్మీ
Iran-Israel | అమెరికా నగరాల్లో ఇరాన్‌కు మద్దతుగా నిరసనలు.. VIDEO